1.రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఎవరు ఉంటారు?

ఎ) పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు

బి) పార్లమెంట్‌లోని మొత్తం సభ్యులు

సి) పార్లమెంట్, విధానసభలకు ఎన్నికైన సభ్యులు

డి) పార్లమెంట్, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విధానసభలకు ఎన్నికైన సభ్యులు




2.రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి ఆర్టికల్ 123 దేని గురించి తెలుపుతుంది?

ఎ) సుప్రీంకోర్టు సలహా కోరడం

బి) ఆర్టినెన్సుల జారీ

సి) నేరస్థులకు క్షమాభిక్ష పెట్టడం

డి) లోక్‌సభ రద్దు




3.ప్రధాని పాత్ర, విధులు, అధికారాల గురించి తెలిపే అధికరణ ఏది?

ఎ) 75

బి) 74

సి) 78

డి) 79






4.ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సభ్యుల సంఖ్య.. లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదని నిర్ణయించారు?

ఎ) 85

బి) 89

సి) 91

డి) 94




5.భారతదేశంలో ఉన్నత న్యాయాధికారి ఎవరు?

ఎ) కేబినెట్ కార్యదర్శి

బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సి) అటార్నీ జనరల్

డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్




6.పార్లమెంట్‌లో సభ్యత్వం లేకపోయినప్పటికీ చర్చలు, సమావేశాల్లో పాల్గొనేది ఎవరు?

ఎ) కేబినెట్ కార్యదర్శి

బి) భారత రాష్ట్రపతి

సి) భారత ఉప రాష్ట్రపతి

డి) అటార్నీ జనరల్






7.1947లో నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి?

ఎ) విజయలక్ష్మీ పండిత్

బి) హంసా మెహతా

సి) సుచేతా కృపలాని

డి) రాజ్‌కుమారి అమృత్ కౌర్




8.కింది వాటిలో ప్రధానమంత్రికి సంబంధించి సరికానిది ఏది?

ఎ) విదేశంలో మరణించిన ఏకైక ప్రధాని - లాల్ బహదూర్ శాస్త్రి

బి) మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని - పి.వి. నరసింహారావు

సి) తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి - చరణ్‌సింగ్

డి) సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపిన ప్రధాని - మొరార్జీ దేశాయ్




9.కింది వాటిలో సరికానిది ఏది?

ఎ) అధికరణ - 15(3) ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం

బి) అధికరణ - 16(2) ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలకు మినహాయింపు

సి) అధికరణ - 22 నిర్బంధించిన వ్యక్తికి రక్షణ

డి) అధికరణ - 19(బి) పత్రికా స్వేచ్ఛ






10.పార్లమెంట్ రూపొందించిన ‘విద్యా హక్కు చట్టం’ సమాజంలో ఎవరికి దోహదపడుతుంది?

ఎ) కళాశాలలకు వెళ్లేవారికి

బి) సాంకేతిక విద్యలో ఉత్సాహం ఉన్న వారికి

సి) సీనియర్ సెకండరీ స్థాయి బాలికలకు

డి) 14 ఏళ్ల లోపు బాలబాలికలకు